నాన్నకు కలిగిన ఫీలింగే నాకూ కలిగింది – మహేష్ బాబు

Mahesh_Babu_Latest_Pics
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమా గత శుక్రవారం విడుదలై అన్ని థియేటర్స్ లో ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు కుమారుడు పిన్స్ గౌతమ్ తెరకు పరిచయమయ్యాడు. అలాగే గౌతమ్ చేసిన నటనకి అందరి నుండి ప్రశంశలు కూడా దక్కాయి.

ఇదే ప్రశ్నని మహేష్ బాబు ముందు ఉంచి గౌతమ్ పరిచయంపై మీరు ఎలా ఫీలవుతున్నారని అడిగితే ‘నేను మొదటి సారి గౌతమ్ ని స్క్రీన్ పై చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. నన్ను స్క్రీన్ పై చూసినప్పుడు నాన్నగారికి ఎలాంటి ఆనందం కలిగిందో నాకు అలాంటి ఆనందమే కలిగిందని’ అన్నాడు.

సుకుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

Exit mobile version