మహేష్, బన్నీ రాకతో నెమ్మదించిన రజిని !

మహేష్, బన్నీ రాకతో నెమ్మదించిన రజిని !

Published on Jan 14, 2020 10:30 PM IST

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో మూడు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. సంక్రాంతి సినిమాలలో ముందుగా వచ్చిన దర్బార్ మూవీ మొదటి రెండు రోజు వసూళ్లు బాగానే అందుకుంది. ఐతే మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర విడుదల తరువాత ఈ చిత్ర వసూళ్లు చాల వరకు పడిపోయాయి. థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గడం మరియు తెలుగు ప్రేక్షకులు మహేష్ మూవీ పట్ల ఆసక్తి చూపడంతో ఈ మూవీ వసూళ్లు పడిపోయాయి. ఇక బన్నీ నటించిన అల వైకుంఠపురంలో మూవీ విడుదల తర్వాత మరింతగా దర్బార్ వసూళ్లు దిగజారిపోయాయి.

ఐతే తమిళంలో మాత్రం ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది. ఇప్పటికే వంద కోట్ల మార్కును ‘దర్బార్’ దాటివేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించారు. రజని సరసన హీరోయిన్ గా నయనతార నటించగా, నివేదా థామస్ రజిని కూతురు పాత్ర చేయడం విశేషం. దర్బార్ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.

తాజా వార్తలు