ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న చిత్రాల్లో యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహా’ అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ యానిమేషన్ చిత్రం డివోషనల్ కంటెంట్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేసిన తీరు అందరినీ అలరిస్తోంది.
ఈ సినిమాకు పిల్లలతో పాటు యూత్, పెద్దలు అందరూ రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇలాంటి డివోషనల్ కంటెంట్ చిత్రానికి ప్రేక్షకులు ఇంతలా కనెక్ట్ అవుతారని తాము అనుకోలేదని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎవరి ఊహలకు అందకుండా దూసుకెళ్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇలా డ్రీమ్ రన్‌ను కంటిన్యూ చేస్తూ అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ నరసింహా బాక్సాఫీస్ దగ్గర ఉగ్రరూపం చూపిస్తున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బ్యానర్ నుండి రాబోయే మరికొన్ని యానిమేషన్ డివోషనల్ చిత్రాల కోసం ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.