యూఎస్ మార్కెట్ లో ఆగని ‘మహావతార్ నరసింహ’.. మరో మార్క్

యూఎస్ మార్కెట్ లో ఆగని ‘మహావతార్ నరసింహ’.. మరో మార్క్

Published on Aug 12, 2025 8:00 AM IST

కేవలం ఒక యానిమేషన్ సినిమా ఊహించని రేంజ్ వసూళ్లు సెట్ చేస్తుంది అని ఇండియన్ సినిమా దగ్గర బహుశా ఎవరూ అనుకోని ఉండరు. ఇప్పుడు అలాంటి ఒక సంచలన రన్ ని కనబరుస్తున్న సినిమానే “మహావతార్ నరసింహ”. చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యి ఇప్పుడు 250 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తుంది.

మరి ఇండియాలో మొదట విడుదల అయ్యి నెక్స్ట్ యూఎస్ మార్కెట్ లో విడుదల అయ్యిన ఈ డివోషనల్ సినిమా అక్కడ కూడా ఊహించని రన్ ని కొనసాగిస్తూ దూసుకెళ్తుంది. చాలా తక్కువ టైం లోనే 1 మిలియన్ మార్క్ దాటేసిన ఈ సినిమా ఇప్పుడు మరో లక్ష డాలర్స్ అందుకొని 1.1 మిలియన్ మార్క్ కి చేరుకుంది. ప్రస్తుతానికి మాత్రమే అదే స్ట్రాంగ్ హోల్డ్ తో సినిమా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా సామ్ సి ఎస్ సంగీతం అందించారు.

తాజా వార్తలు