నిందల నడుమ మధురిమ

నిందల నడుమ మధురిమ

Published on Mar 13, 2014 9:50 PM IST

Madhurima-Banerjee

షాడో, సరదాగా కాసేపు, మహంకాళి వంటి సినిమాలలో కనిపించిన మధురిమ బెనర్జీ తమిళ సినిమా షూటింగ్ లో తన వింత ప్రవర్తనకు కారణంగా చీవాట్లు తిన్నాది. ‘సేరెందు పోలమా’ అనే తమిళ చిత్రంలో ఈ భామ కూడా ఒక నాయిక. ఈ చిత్ర బృందమంతా ఇపుడు న్యూజిల్యాండ్ లో వున్నారు. అక్కడ ఈమె ప్రవర్తన కారణంగా చీవాట్లు తినవలిసి వచ్చింది

ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా దర్శకుడు అనీల్, మధురిమ ఎప్పుడూ సెట్ కు చాలా ఆలస్యంగా వస్తుందని, దాని కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడమేకాక బోలెడు డబ్బు కూడా నష్టమని తెలిపాడు. కొన్ని సార్లు మొత్తం బృందమంతా తన కోసం వేచి వున్నా తనకేమాత్రం పట్టింపు వుండదని చెప్పుకొచ్చాడు

ఇదే ప్రశ్న మన హీరోయిన్ ని అడిగితే తనని ఏ కారణం లేకుండా నిందిస్తున్నారని నిట్టూర్చింది. “విదేశాలకు షూటింగ్ కి వచ్చే ముందు కూడా నాకు 10శాతం రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అంతేకాక వీరు చేసిన పనుల మూలాన మా అమ్మ విసా చేతికందక మొదటిసారిగా నేనొక్కదాన్నే ఫారన్ రావలిసి వచ్చింది. ఏంటి అని ప్రశ్నించబోతే నాపై లేనిపోని నిందలు వేస్తున్నారని” తెలిపింది. త్వరలో ఈ భామ అల్లు శిరీష్ సరసన కొత్త జంట సినిమాలో నటించనుంది. మారతీ దర్శకత్వంలో బన్నీ వాస్ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు

తాజా వార్తలు