గౌతం చిత్రానికి దర్శకత్వం వహించనున్న మధుర శ్రీధర్


గతంలో “స్నేహ గీతం” మరియు “ఇట్స్ మై లవ్ స్టొరీ” చిత్రాలకి దర్శకత్వం వహించిన మధుర శ్రీధర్, బ్రహ్మానందం తనయుడు గౌతం రాబోతున్న చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం వీర్య దానం అనే అంశం మీద ఉండబోతుంది. కొద్ది రోజుల క్రితం మధుర శ్రీధర్ ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ ఒకానొక మహిళా ఐఐటి విద్యార్ధి వీర్యం కావాలని అడగటం ఈ చిత్రాన్ని తీయటానికి స్ఫూర్తి అని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశల్లో ఉంది. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు ఆగస్ట్ మొదటి వారంలో ప్రకటిస్తారు. గతంలో గౌతం “పల్లకిలో పెళ్లి కూతురు” మరియు “వారెవా” చిత్రాలలో నటించారు ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందాయి. మధుర శ్రీఎధర్ తో చేస్తున్న ఈ చిత్రం అయిన తనకి విజయం అందిస్తుందో లేదో చూడాలి.

Exit mobile version