మధు శాలిని తన తొలి బాలివుడ్ చిత్రం “డిపార్ట్ మెంట్” చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో గ్యాంగ్ స్టర్ కనిపించబోతుంది. మొదట్లో ఈ చిత్ర ప్రచార పత్రం విడుదల చేసినపుడు అందరు ఆశ్చర్యపోయారు. ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ , సంజయ్ దత్ , లక్ష్మి మంచు , అంజన సుఖాని మరియు రానా దగ్గుబాటి ల తో కలిసి ఈ భామ కనిపిస్తున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ చిత్రం ఈ సంవత్సరం మద్యలో విడుదల కానుంది.. స్వతాహా గా తెలుగు అమ్మాయి అయిన మధు శాలిని ఎక్కువగా పర భాషల మీద ద్రుష్టి సారించినట్టున్నారు గతం లో తమిళం లో బాలా అవన్-ఇవన్(వాడు-వీడు) చిత్రం లో ఆర్య సరసన నటించారు.