బాక్సాఫీస్ దగ్గర స్ట్రగుల్ అవుతున్న ‘మదరాసి’

బాక్సాఫీస్ దగ్గర స్ట్రగుల్ అవుతున్న ‘మదరాసి’

Published on Sep 11, 2025 10:01 PM IST

రీసెంట్ గా తమిళ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రమే “మదరాసి”. టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం తమిళ ఆడియెన్స్ లో ఓ మాదిరిగా టాక్ తెచ్చుకొని వెళుతుంది. తెలుగులో అంత రెస్పాన్స్ ని అందుకోని ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఆనందాన్ని పంచుకున్నట్టు శివ కార్తికేయన్ చేసిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది.

కానీ వీటితో బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమా గట్టెక్కేలా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో అయితే ఎపుడో తేలిపోయింది కానీ ఓవరాల్ గా కూడా సినిమా వసూళ్ల పరంగా స్ట్రగుల్ అవుతుందట. ఓవర్సీస్ లో కొంచెం పర్లేదు కానీ టోటల్ ఇండియా వైడ్ మాత్రం డ్రాప్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. సో మదరాసి ఫైనల్ గా ప్లాప్ గానే మిగిలిపోతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు