పవన్ – త్రివిక్రమ్ సినిమాను భారీ ధరకు సొంతంచేసుకున్న మా టీవి

పవన్ – త్రివిక్రమ్ సినిమాను భారీ ధరకు సొంతంచేసుకున్న మా టీవి

Published on Jun 13, 2013 8:15 PM IST

Pawan-Kalyan-and-Trivikram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా శాటిలైట్ హక్కులను మా టీ.వి రికార్డు ధరకు సొంతం చేసుకుంది. దీని ధర దాదాపు 9కోట్లంట. ఒక తెలుగు సినిమాకు ఇంత డబ్బు వెచ్చించడం ఇదే మొదటిసారి. ఈ సినిమా హాస్యభరితమిన కుటుంబ కధా చిత్రంగా తెరకెక్కుతుంది గనుక ఇంత ధర వెచ్చించారు. పవన్, త్రివిక్రమ్ ల కలయికకు సమంత తోడవ్వడం మరింత సహాయపడింది.

శాటిలైట్ హక్కుల విషయానికి వస్తే పవన్, త్రివిక్రమ్ ల ఇద్దరికీ మంచి రికార్డేవుంది. నిజానికి త్రివిక్రమ్ సినిమాలలో వుండే వినోదానికి టీ.వి ల ముందు ప్రేక్షకులు తమ కళ్ళను అప్పగించేస్తారు.

‘అత్తారింటికి దారేది’ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మా టీ.వి ఈ సినిమాకే కాక గోపీచంద్ నటిస్తున్న ‘సాహసం’ సినిమా హక్కులను కూడా సొంతం చేసుకుంది.

‘అత్తారింటికి దారేది’ సినిమా ఆగష్టులో విడుదలకావచ్చని అంచనా.

తాజా వార్తలు