ఎం.ఎస్.రెడ్డి గారు ఇక లేరు

ఎం.ఎస్.రెడ్డి గారు ఇక లేరు

Published on Dec 11, 2011 11:45 AM IST


తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖ వ్యక్తి మల్లెమాల సుందర రామి రెడ్డి గారు ఇక లేరు. మల్లెమాల పేరుతో ఎన్నో కవితలు రాసిన ఆయన వయస్సు 87 సంవత్సరాలు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ తరలి రావడానికి ఆయన ఎనలేని కృషి చేసారు. 1924 లో జన్మించిన ఆయన ఎన్నో రచయితగా ఎన్నో రచనలు చేసారు. సహజ కవి గా ఆయనకి పేరు సంపాదించుకున్నారు. ఆయన ఐదు వేలకు పాటలు పాటలు రాసారు.

మల్లెమాల గారు నిర్మాతగా ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. చైల్డ్ ఆర్టిస్ట్స్ తో తీసిన ‘బాల రామాయణం’ కూడా ఆయనే నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగు చలన చిత్రకి ఆయనే పరిచయం చేసారు. ఆయన శబ్దాలయ స్టూడియో స్థాపించి 25 చిత్రాలకు పైగా నిర్మించారు. ఆయన మరణం మమ్మల్ని కలచివేసింది. మా సంస్థ వ్యవస్థాపకుడు మరియు మార్గదర్శకుడిని కోల్పోయాము.

123తెలుగు.కాం తరపున శ్రీ శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి మరియు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు