జనవరిలో చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్న ఎం ఎస్ రాజు చిత్రం

జనవరిలో చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్న ఎం ఎస్ రాజు చిత్రం

Published on Dec 22, 2012 2:50 PM IST

MS-RAJU
ఎం ఎస్ రాజు రాబోతున్న చిత్రం “RUM” ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కనుంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం “RUM” అంటే రంభ, ఊర్వశి మరియు మేనక. ఈ చిత్రంలో త్రిష పూర్ణ మరియు అర్చన ప్రధాన పాత్రలు పోషించనున్నారు ఈ చిత్రానికి ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఎం ఎస్ రాజు నిర్మాణంలో వచ్చిన “వర్షం”, “నువ్వొస్తానంటే నేనొద్దంటాన” మరియు “పౌర్ణమి” వంటి చిత్రాలలో త్రిష కథానాయికగా నటించింది. ఈ చిత్రం గురించి త్రిష ట్విట్టర్లో స్వయంగా చెప్పారు. అంతే కాకుండా ఈ చిత్రంలో ప్రచారంలో ఉన్నట్టు తను యువరాణి లేదా పోలీస్ పాత్రలో కనిపించడం లేదని స్పష్టం చేశారు. త్రిష త్వరలో “వెంటాడు వేటాడు” చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 28న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు