ఐటి ప్రొఫెషనల్స్ కి లవ్ యు బంగారం స్పెషల్ ప్రిమియర్ షో

ఐటి ప్రొఫెషనల్స్ కి లవ్ యు బంగారం స్పెషల్ ప్రిమియర్ షో

Published on Jan 21, 2014 3:00 AM IST

Love_U_Bangaram_movie

సౌత్ ఇండియా మూవీ ప్రమోషన్స్ లో బాగా చురుకుగా ఉన్న ఏజన్సీ శ్రేయాస్ మీడియా. వారు ప్రతి సినిమా విషయంలో ప్రమోషన్స్ కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ‘లవ్ యు బంగారం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి చుట్టూ తిరిగే కథాంశం ఇది. దాంతో శ్రేయాస్ మీడియా వారు ఐటి ప్రొఫెషనల్స్ కి ఫ్రీ గా స్పెషల్ ప్రీమియర్ షో వెయ్యడానికి నిర్ణయించుకున్నారు.

దీనికి మీరు చేయాల్సిందల్లా మీ ఐడి కార్డ్స్ తీసుకొని శ్రేయాస్ మీడియా ఆఫీసుకి మీ టికెట్స్ కలెక్ట్ చేసుకోవడమే. స్పెషల్ ప్రిమియర్ షో 23వ తేదీ(గురువారం) రాత్రి 9 గంటల 30 నిమిషాలకు బంజారా హిల్స్ సినిమాక్స్ లో వేయనున్నారు. మరింకెందుకు ఆలస్యం వెళ్లి టికెట్స్ తెచ్చుకోండి. అడ్రస్ వివరాల కోసం శ్రేయాస్ మీడియా ఫేస్ బుక్ పేజ్ ని విజిట్ చేయండి.

రాహుల్,రాజీవ్, శ్రావ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి గోవి డైరెక్టర్. కెఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత వల్లభ – మారుతీ టాకీస్ అధినేత మారుతి కలిసి ఈ సినిమాని నిర్మించారు.

తాజా వార్తలు