వైజాగ్ సిసిఎల్ మ్యాచ్ లో ‘లవ్ జర్నీ’ ఆడియో విడుదల

వైజాగ్ సిసిఎల్ మ్యాచ్ లో ‘లవ్ జర్నీ’ ఆడియో విడుదల

Published on Feb 5, 2012 5:16 PM IST

జర్నీ ఫేం జై హీరోగా కలర్స్ స్వాతి మరియు షాజన్ పదమ్సీ హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘కనిమొళి’ తెలుగులో ‘లవ్ జర్నీ’ పేరుతో విడుదలవుతుంది. ఈ చిత్రానికి శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించగా జక్కుల నాగేశ్వర రావు తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. వైజాగ్లో తెలుగు వారియర్స్ మరియు చెన్నై రైనోస్ జట్ల మధ్య జరిగిన సిసిఎల్ మ్యాచ్ లో ఈ చిత్ర ఆడియో విడుదల చేసారు. సిసిఎల్ డైరెక్టర్ శ్రీనివాస మూర్తి ఆడియో ఆవిష్కరించి మొదటి సీడీని హీరో శ్రీకాంత్ కి అందించారు. సీడీ లోగోని ఛార్మి, ప్రియమణి, లక్ష్మి రాయ్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో జక్కుల నాగేశ్వర రావు, సంగీత దర్శకుడు సతీష్ చక్రవర్తి, దర్శకుడు శ్రీపతి రంగస్వామి పాల్గొన్నారు. సినిమాని కూడా ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

తాజా వార్తలు