యూజీ క్రియేషన్స్ బ్యానర్‌పై “సమ్మతమే” ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న కొత్త చిత్రానికి “లవ్ జాతర” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రొడ్యూసర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా ఈ రోజు విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే, “లవ్ జాతర” సినిమా పూర్తి స్థాయి రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
“లవ్ జాతర”కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మేకర్స్ త్వరలోనే విడుదల చేయనున్నారు.