గత కొన్నాళ్ల నుంచి మంచు వారి కుటుంబంలో మంచు మనోజ్ అలాగే మంచు విష్ణుల నడుమ జరుగునున్న వాగ్వాదం కోసం అందరికీ తెలిసిందే. దీనితో ఇరువురి నడుమ దూరం ఉంది అనే మాట అందరికీ తెలుసు. అయితే లేటెస్ట్ గా మంచు విష్ణు కన్నప్ప నేడు గ్రాండ్ గా రిలీజ్ కాగా నిన్న మంచు మనోజ్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్పాడు కానీ విష్ణు పేరు మాత్రం ఎక్కడా మెన్షన్ చేయకపోవడం ఆసక్తిగా మారింది.
కానీ నేడు మాత్రం తన సోదరుడు కన్నప్ప సినిమా కోసమే కాకుండా తన నటన కోసం మాట్లాడ్డం అనేది షాకింగ్ గా మారింది. విష్ణు అసలు ఈ రేంజ్ లో చేస్తాడని అనుకోలేదు అని సినిమా చాలా బాగుందని మనోజ్ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరో మనోజ్ నుంచి మాత్రం ఇది ఒకింత ఊహించనిదే అని చెప్పాలి. ఇక దీనిపై విష్ణు సైడ్ నుంచి ఏమన్నా రియాక్షన్ వస్తుందేమో చూడాలి.