ఓటీటీ సమీక్ష : స్క్విడ్ గేమ్ సీజన్ 3 – నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 27, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : నెట్‌ఫ్లిక్స్‌

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : లీ జంగ్-జే, లీ బ్యుంగ్-హున్, వి హ-జూన్ తదితరులు
దర్శకత్వం : హ్వాంగ్ డాంగ్-హ్యుక్
నిర్మాతలు : హ్వాంగ్ డాంగ్-హ్యుక్, కిమ్ జి-యోన్
సంగీత దర్శకుడు : జుంగ్ జే-ఇల్
సినిమాటోగ్రాఫర్ : లీ హ్యోంగ్-డియొక్
ఎడిటర్ : నమ్ నా-యంగ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రాచుర్యం పొందిన ‘స్క్విడ్ గేమ్’ సిరీస్‌లో మూడో సీజన్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. సెకండ్ సీజన్ పెద్దగా ఆకట్టుకోకపోయినా, మూడో సిరీస్‌పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఈ మూడో సీజన్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

సీజన్ 2 ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే సీజన్ కథ ప్రారంభం అవుతుంది. తన తప్పులకు ప్రాయశ్చిత పడాలనుకునే షియెంగ్ జి-హున్(లీ జంగ్-జే) ఆ తప్పులకు తానే కారణమని అనుకుంటాడు. అయితే, కొత్తగా జరగబోయే ఆటలో జున్ హీ(జో యురి) ఓ గర్భవతి అయినా, తన కలలు ఎలాగైనా సాకారం చేయాలనుకుంటుంది. తన చుట్టూ ఉండే మహిళా ఖైదీలతో ఆమె ఎమోషనల్ బాండింగ్ ఆకట్టుకుంది. అయితే, ఈసారి ఆటలో మరింత క్రూరత్వం ఉండేందుకు షియెంగ్ జి-హున్(లీ జంగ్-జే) విఐపి ఆటగాళ్లను దించుతాడు. మరి ఈసారి జరిగే ఆటల్లో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..? నిజంగానే హీరో అమాయకులను కాపాడుతాడా..? ఈ సీజన్‌తో ఈ వెబ్ సిరీస్ ముగుస్తుందా లేక ఇంకో సిరీస్ ఉందా..? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

రెండో సీజన్ మిస్‌ఫైర్ కావడంతో, ఈసారి మేకర్స్ చాలా పకడ్బందీగా తమ సిరీస్‌ను ప్లాన్ చేసుకున్నారు. ఈ సిరీస్ ప్రారంభంలోనే జరిగే హైడ్ అండ్ సీక్ గేమ్ ఆటపై ఆసక్తిని పెంచుతుంది. రెండు ఎపిసోడ్స్ తర్వాత కూడా ఈ తరహా గేమ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేయడం విశేషం.

జంపింగ్ రోప్ ఛాలెంజ్ గేమ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన అదిరిపోయింది. చాలా వేగంగా జరిగే ఈ గేమ్ ప్రేక్షకులను గ్రిప్పింగ్‌గా ఆకట్టుకుంది. కొన్ని ఎమోషన్స్ కూడా ఈ గేమ్‌పై ఆసక్తిని క్రియేట్ చేశాయి.

ఫైనల్ గేమ్‌లో ఆటగాళ్లు సొంత నిర్ణయం తీసుకునే సందర్భాన్ని చాలా ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారు. ఈ సిరీస్‌కు ఇది మరింత బలాన్ని చేకూర్చింది.

ఇక ఈ సిరీస్‌లో వచ్చే ఫైనల్ ట్విస్ట్ ప్రేక్షకులకు చాలా అరుదుగా కనిపిస్తుంది. కొంతమందికి అది నచ్చకపోయినా, చాలా మందికి సర్‌ప్రైజింగ్‌గా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్‌లోనూ నటీనటులు తమ పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ వేశారు.

మైనస్ పాయింట్స్ :

చాలా చోట్ల మార్పులు చేసినా కూడా ఈ సిరీస్ కొన్ని చోట్ల అనుకున్న స్థాయిలో మెప్పించలేదు. డిటెక్టివ్ పాత్రకు సంబంధించిన కథ ప్రేక్షకులను ఆకట్టుకోదు. అంతేగాక, అసలు కథపై ఈ పార్ట్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

5, 6 ఎపిసోడ్స్ కూడా చాలా స్లో పేస్‌తో సాగడం ప్రేక్షకులను విసుగు పెట్టిస్తాయి. ఈ రెండు ఎపిసోడ్స్‌ను ఒకే ఎపిసోడ్‌లో ముగించేయొచ్చు కదా అని ప్రేక్షకులు ఫీల్ అవుతారు.

మరికొన్ని పాత్రలు కూడా పూర్తిగా కథకు సంబంధం లేని విధంగా రాసుకున్నారు. మరికొన్ని పాత్రలను ఎందుకు ముగించారో కూడా అర్థం కాదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు హ్వాంగ్ డాంగ్-హ్యుక్ ఈసారి కథను మరింత తెలివిగా హ్యాండిల్ చేశాడని చెప్పాలి. కథను నెరేట్ చేయడం కంటే కూడా గత సీజన్ తాలుకా ప్రభావం ఏమీ లేకుండా జాగ్రత్త పడ్డాడు. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. క్రూరత్వం, ఎమోషన్.. రెండింటినీ బాగా కవర్ చేశాడు. సంగీతం కూడా సందర్భానుసారంగా ఎలివేట్ అయింది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది.

తీర్పు :

మొత్తానికి.. ‘స్క్విడ్ గేడ్’ సీజన్ 3 ఒక ఎమోషనల్ అండ్ గ్రిప్పింగ్ ఫినాలే కథను మనకు ప్రజెంట్ చేస్తుంది. ఇందులోని ఆటలను చక్కగా చూపెట్టారు.. కథను కూడా ఎక్కడా ట్రాక్ తప్పకుండా చూసుకున్నారు. అయితే, సీజన్ 1 – 2 లోని బ్రిలియన్స్, పాత్రల తీరును ఇందులో సరిగా మెయింటెయిన్ చేయలేకపోయారు. ఈ సిరీస్‌ను ఫాలో అయ్యే వారికి ఇందులో మంచి స్టఫ్ ఉందనిపిస్తుంది.. కొత్తవారికి మాత్రం ఇంతకుముందు ఏం జరిగింది.. అనేది తెలుసుకోవాలనిపిస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

Exit mobile version