విడుదల తేదీ : జూన్ 27, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : మంచు కాజోల్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, రోనిత్ రాయ్, ఖెరిన్ శర్మ తదితరులు
దర్శకుడు : విశాల్ ఫురియా
నిర్మాతలు : అజయ్ దేవ్గన్, జ్యోతి దేశ్‌పాండే
సంగీతం : రాఖీ ఖన్నా, శివ్ మల్హోత్రా, అమర్ మోహిలె, హర్ష్ ఉపాధ్యాయ్
సినిమాటోగ్రఫీ : పుష్కర్ సింగ్
ఎడిటర్ : సందీప్ ఫ్రాన్సిస్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
కథ :
వెస్ట్ బెంగాల్‌లోని చంద్రాపూర్‌లో ఓ మూఢనమ్మకం కొలువై ఉంటుంది. దాని ప్రకారమే ఓ కుటుంబంలో పుట్టే ఆడపిల్లలను బలి ఇస్తుంటారు. అయితే అదే కుటుంబంలో పుట్టిన శువంకర్(ఇంద్రనీల్ సేన్‌గుప్త) తన భార్య అంబికా(కాజోల్) కూతురు శ్వేత(ఖెరిన్ శర్మ)తో చంద్రపూర్‌కు దూరంగా జీవనం కొనసాగిస్తుంటాడు. కానీ, తన తండ్రి చనిపోయాడనే వార్తతో సొంతూరుకు వెళ్లిన శువంకర్ కూడా చనిపోతాడు. దీంతో వారికి సంబంధించిన బంగ్లాను అమ్మేందుకు తన కూతురుతో కలిసి అంబికా ఆ ఊరికి వెళ్తుంది. ఇంతకీ ఆ ఊరిలో ఉన్న మూఢనమ్మకం ఏమిటి..? అది నిజంగానే జరుగుతుందా..? లేక దాని వెనకాల ఎవరైనా ఉన్నారా..? అంబికా తన కూతురితో పాటు ఎన్ని అవాంతరాలు ఎదుర్కొంటుంది..? చివరకు ఆ గ్రామంలో ఏమైంది..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు ఎంచుకున్న కథ నేటితరానికి చాలా రొటీన్‌గా అనిపించినా అందులో అక్కడక్కడా మెరిసే పాయింట్స్ ఉండటం విశేషం. ఓ కూతురు కోసం తల్లి ఎంతవరకైనా వెళ్తుంది.. అనే పాయింట్ ఆకట్టుకుంటుంది. ఇక ఇతిహాసాలతో సంబంధం ఉన్నట్లు ఈ కథను రాసుకున్న పాయింట్ కూడా బాగుంది.
కాజోల్ తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. తన కూతురిని కాపాడేందుకు ఆమె చేసే పోరాటం బాగుంది. అయితే, ఫస్ట్ హాఫ్‌లో ఆమె పాత్రని చాలా సింపుల్‌గా చూపెట్టి.. సెకండాఫ్‌లో పవర్‌ఫుల్‌గా మార్చిన తీరు బాగుంది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీక్వెన్స్‌లు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకు మేజర్ డ్రా బ్యాక్. పాత సినిమాల్లో లాగా ఈ కథను నెరేట్ చేసిన విధానం చాలా బోరింగ్ తెప్పించింది. ఇక ఫస్టాఫ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. స్లోగా స్టార్ట్ అయ్యే కథను అంతే స్లోగా ముందుకు తీసుకెళ్లిన తీరు ప్రేక్షకులను విసిగిస్తుంది.
సెకండాఫ్‌లో కొన్ని ఆకట్టుకునే సీక్వెన్స్‌లు ఉన్నా, మధ్యలో వచ్చే ల్యాగ్ సీన్స్ ఈ సినిమాను డ్యామేజ్ చేశాయి. చాలా సీన్స్ ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి.
ఏదో కథ నడవాలనే ఉద్దేశ్యంతోనే సినిమాలో ఇన్ని ఎపిసోడ్స్ పెట్టినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్‌ను బాగానే ప్లాన్ చేసుకున్నా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు విశాల్ ఫురియా ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోయాడు. హారర్, వీఎఫ్ఎక్స్ అంశాలపైనే అతడి ఫోకస్ పెట్టినట్లుగా అనిపించింది. దీంతో కథ, కథనం దారి తప్పాయి. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పెద్దగా చేసిందేమీ లేదు. ఎడిటింగ్ వర్క్ ఇంకా బాగుండాల్సింది. సంగీత పరంగా బీజీఎం వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా, ‘మా’ మూవీ ఓ ఫాంటెసీ హారర్ చిత్రంగా ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయింది. నటీనటులు పర్ఫార్మెన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ టెంప్లేట్‌గా ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేసిన తీరు ప్రేక్షకులను మెప్పించదు. ఫాంటెసీ హారర్ జోనర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను స్కిప్ చేయడం బెటర్.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team