భారిగా ప్రచారం చేస్తున్న “లవ్ ఫైల్యూర్” చిత్ర బృందం

భారిగా ప్రచారం చేస్తున్న “లవ్ ఫైల్యూర్” చిత్ర బృందం

Published on Jan 28, 2012 2:39 PM IST


సిద్దార్థ్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “లవ్ ఫైల్యూర్” ప్రచారం ఊపందుకుంది. మరి కాసేపట్లో ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది . సిద్దార్థ్,తమన్ మరియు అమలా పాల్ ఈరోజు హైదరాబాద్ లో వివిధ చానల్స్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల ప్రచార పోస్టర్ ఈరోజు అన్ని వార్త పత్రికలలోను వచ్చింది. ఇందులో సిద్దార్థ్ మరియు అమలా పాల్ ల బంధం మొదట్లో ఎలా ఉంది తరువాత ఎలా మారించి అని చూపించారు. ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతాన్ని అందించారు. తెలుగు లో సిద్దార్థ్ మరియు వేణుగోపాల్ కలిసి ఏటకి బ్యానర్ మీద నిర్మించారు. ఇంకొద్ది సేపట్లో ప్రసాద్ మల్టిప్లెక్స్ లో ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది. ఈ చిత్రం ఫిబ్రవరి మధ్యలో విడుధలవ్వచ్చు

తాజా వార్తలు