విడుదలకు సిద్ధమవుతున్న లవ్ ఫేల్యూర్

విడుదలకు సిద్ధమవుతున్న లవ్ ఫేల్యూర్

Published on Jan 10, 2012 3:07 PM IST


యువతరం నటుడు సిద్ధార్థ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లవ్ ఫేల్యూర్’. ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సిద్ధార్థ్ సరసన అమలా పాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన తెలుగు చిత్ర పంపిణీ హక్కులు దిల్ రాజు దక్కించుకున్నారు. బాలాజీ మోహన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న లవ్ ఫేల్యూర్ చిత్రం యూత్ కాలేజ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు