100 రోజులు పూర్తి చేసుకున్న ‘లవ్ ఫెయిల్యూర్’


సిద్ధార్థ్ మరియు అమలా పాల్ నటించిన రొమాంటిక్ లవ్ స్టొరీ ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రం ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకుంది. తమిళంలో ‘కాధలిల్ సోదప్పవదు ఎప్పడి’ సినిమాని తెలుగులో లవ్ ఫెయిల్యూర్ పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. 5 కోట్ల రూపాయల తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో కలిపి 13 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలాజీ మోహన్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని ఇతకి ఎంటర్టైన్మెంట్ మరియు వై నాట్ బ్యానర్ పై సిద్ధార్థ్ మరియు నిరవ్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం అందించిన లవ్ ఫెయిల్యూర్ చిత్రానికి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version