రీసెంట్ గా భారీ అంచనాలు నడుమ థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఆడియెన్స్ అంచనాలు అందుకోలేకపోయిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది “కూలీ” సినిమా అని చెప్పవచ్చు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కింగ్ నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, అమీర్ ఖాన్ లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ కలయికలో లోకేష్ చేసిన ఈ సినిమా అంచనాలు అందుకోకపోయినప్పటికీ వసూళ్ల పరంగా దుమ్ము లేపింది.
అయితే తన సినిమాల విషయంలో ఆడియెన్స్ అభిప్రాయాన్ని తప్పుబట్టి లోకేష్ కనగరాజ్ కుండ బద్దలుకొట్టాడు. కూలీ సినిమా విషయంలో ఆడియెన్సే తప్పుడు అంచనాలు పెట్టుకున్నారు అని బాహాటంగానే చెప్పాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందు చాలా మంది ‘కూలీ’ విక్రమ్, ఖైదీ, లియో సినిమాలకి లింక్ అని ఎవరికి నచ్చిన థియరీలు వారు రాసుకొని థియేటర్స్ కి వెళ్లారు.
చివరి నిమిషం వరకు ఎక్కడైనా లింక్ ఉండకపోతుందా అని ఎదురు చూసినవారు కూడా లేకపోలేదు. కానీ ఎప్పుడు నుంచో తాను రజినీకాంత్ తో చేస్తున్న సినిమా స్టాండలోన్ ప్రాజెక్ట్ అని తన సినిమాటిక్ యూనివర్స్ కి ఎలాంటి లింక్ లేదని, టైం ట్రావెల్ సినిమా కూడా కాదని మొత్తుకున్నాడు. అయినప్పటికీ ఆడియెన్స్ ఆశలు పెట్టుకోవడం మొదటికే మోసాన్ని తీసుకొచ్చింది. దీనితో ఇదే లోకేష్ లేటెస్ట్ గా చెప్పుకొచ్చాడు. సో తన స్టేట్మెంట్ లో ఎలాంటి తప్పు లేదనే అనుకోవాలి.