మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ నేడు(అక్టోబర్ 31) సాయంత్రం పడుతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
అయితే, ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఎంతమొత్తంలో కలెక్షన్స్ రాబడితే బ్రేక్ ఈవెన్ చేరుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.21 కోట్ల షేర్ వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అందుకుంటుందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.14 కోట్ల షేర్ వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ అందుకుంటుందట. మరి ఈ మ్యాజిక్ ఫీట్‌ను మాస్ జాతరతో రవితేజ అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు.
