ఓటీటీలోకి తెలుసు కదా.. అప్పుడేనా..?

telusu  kada

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన రీసెంట్ మూవీ ‘తెలుసు కదా’ మంచి అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేయగా రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మిక్సిడ్ రెస్పాన్స్ దక్కింది.

దీపావళి పండుగ బరిలో ఇతర సినిమాలతో పోటీగా ఈ చిత్రం రావడం కొంతవరకు ఎఫెక్ట్ అయింది. ఇక ఈ సినిమా టోటల్ రన్‌లో మిగతా చిత్రాలతో వెనుకబడిందని చెప్పాలి. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్‌పై పలు వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

‘తెలుసు కదా’ చిత్ర డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, ఈ చిత్రాన్ని నవంబర్ 13 నుండి ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని భావిస్తోందట. మరి నిజంగానే ఈ సినిమా నవంబర్ 13 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా అనేది చూడాలి. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version