ఫోటో మూమెంట్ : అట్టహాసంగా అల్లు శిరీష్ – నయనిక నిశ్చితార్థం

Allu Sirish

అల్లు ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. ఇటీవల వరుస విషాదాలను ఎదుర్కొన్న ఈ ఫ్యామిలీ ఇప్పుడు కొత్త సంబరాన్ని జరుపుకుంటుంది. హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది.

నయనికతో వివాహబంధంలోకి అడుగుపెట్టేందుకు అ్లలు శిరీష్ సిద్ధమయ్యాడు. వీరిద్దరి నిశ్చితార్థ వేడుకను శుక్రవారం హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. ఇరువురి కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.

ఇక అల్లు శిరీష్ – నయనిక నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన ఈ జంటకు అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Exit mobile version