లిక్కర్ సాంగ్ లో బిజీగా ఉన్న కొరియర్ బాయ్ నితిన్

లిక్కర్ సాంగ్ లో బిజీగా ఉన్న కొరియర్ బాయ్ నితిన్

Published on Jul 17, 2013 5:13 PM IST

Nithin

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల సూపర్ సక్సెస్ తర్వాత నితిన్ ప్రస్తుతం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. యామి గౌతం హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ప్రేమ్ సాయి డైరెక్టర్. ఈ సినిమాలో బయట మనకు లభించే రకరకాల లిక్కర్ పై ఓ పాట ఉంది. ఈ విషయాల్ని నితిన్ ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. ‘ కొరియర్ బాయ్ కళ్యాణ్ కోసం ఓ పార్టీ సాంగ్ చేస్తున్నాం. ఈ సాంగ్ కూడా లచ్చమ్మ సాంగ్ అంత ఫేమస్ అవుతుంది. ఈ పాట మొత్తం నేను తాగుతూ ఉండాలి. విస్కీ తోటి గుండె సాఫు, బ్రాందీ కొట్టు బిపి ఆపు, ఒంటి కలర్ పెంచు వైను, బొజ్జ పెంచు బీరు కాను అని’ ఈ పాట సాగుతుందని నితిన్ తెలిపాడు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాని అందరికీ తెలిసిన డైరెక్టర్ గౌతం మీనన్ నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు