ఈతరం కమేడియన్ లలో ఆయనకే చెందిన ఒక పంధాలో కామెడిని పండించగలిగే వ్యక్తి ధర్మవరపు సుభ్రమణ్యం. ‘ఆనందో బ్రహ్మ’ సీరియల్ ద్వారా పాపులర్ అయిన ఈయన ఇప్పటివరకూ దాదాపు 750 సినిమాలలో నటించారు. ఈరోజు ఆయన 60వ జన్మదినంజరుపుకుంటున్నారు
ఆయన ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఇప్పటికే 10 శాతంకంటే తక్కువ సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో మనం బతుకుతున్నాం. ఉన్న కష్టాలు చాలవన్నట్టు రాజకీయ గొడవలు కొన్ని సినిమాల విడుదలకు జాప్యం చేస్తున్నాయి. దీని వల్ల నిర్మాతల,, పంపిణీదారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారయిందని తెలిపారు
పరాయి భాష నటుల వలన మన వారికి అవకాశాలు తగ్గుతున్నాయని ఆయన భావిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవలే కోలుకుంటున్నారు. మన తెలుగు సినిమా ఇచ్చిన ధర్మ’వరానికి’ 123తెలుగు ద్వారాజన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం