ప్రముఖ హిందీ నటుడు రాజేష్ ఖన్నా ఇక లేరు..

ప్రముఖ హిందీ నటుడు రాజేష్ ఖన్నా ఇక లేరు..

Published on Jul 18, 2012 3:01 PM IST


బాలీవుడ్ చలన చిత్ర చరిత్రలో ఈ రోజు ఎంతో బాధాకరమైనదిగా నిలిచిపోతుంది. ఎందుకంటే బాలీవుడ్ లెజెండ్రీ నటుడు మరియు ఇండియన్ సినిమాకి మొట్టమొదటి సూపర్ స్టార్ అయిన రాజేష్ ఖన్నా కొద్దిసేపటి క్రితమే ముంబైలో కన్నుమూశారు. 69 సంవత్సరాల వయసుగల ఈయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

‘కాకా’ గా బాగా పేరున్న రాజేష్ ఖన్నా 1960 మరియు 1970 ల్లో ఆనంద్, ఆరాధన మరియు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. రాజేష్ ఖన్నా చనిపోయే సమయానికి ఆయన మొదటి భార్య డింపుల్ కపాడియా మరియు కూతురు రింకీ ఖన్నాలు ఆయన దగ్గరే ఉన్నారు.

123తెలుగు.కామ్ తరపున రాజేష్ ఖన్నా కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు