తెలుగు ప్రజలందరూ ముద్దుగా ‘అన్న గారు’ అని పిలుచుకునే లెజెండ్ నందమూరి తారకరామారావు గారి 89వ జయంతి నేడు. ఎన్టీఆర్ కృష్ణ జిల్లా లోని నిమ్మకూరు ప్రాంతంలో చిన్న వ్యవసాయ కుటుంబలో 1923 మే 23న జన్మించారు. దాదాపు 320 చిత్రాల్లో నటించిన ఆయన పౌరాణికం మరియు జానపద చిత్రాల్లో తనకు ఎవరు సరి రాలేనంత స్థాయిలో నటించే వారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గొప్ప చిత్రాలైన పాతాల బైరవి, మాయా బజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, రాముడు – భీముడు, దాన వీర శూర కర్ణ, బొబ్బిలి పులి, వేటగాడు వంటి ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి తనకి తానే సతి అని నిరూపించుకున్నారు. హీరోగా కొనసాగుతూనే రావణుడు, దుర్యోధనుడు వంటి నేగాతివే పాత్రలు కూడా చేసి మెప్పించారు. మాస్ అభిమానులు మెచ్చే హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలిపాడు.
ఎన్టీఆర్ గారి 89వ జయంతి సందర్భంగా 123తెలుగు.కాం ఆయనకు సెల్యూట్ చేస్తుంది.