యుఎస్ లోనూ కలెక్షన్స్ రాబట్టుకుంటున్న లెజెండ్

legend-censor-details
నందమూరి బాలకృష్ణ నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’. రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా యుఎస్ లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఫేమస్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ కూడా యుఎస్ లో లెజెండ్ కలెక్షన్స్ బాగున్నాయని ట్వీట్ చేసాడు.

ఈ సినిమా విజయాన్ని పురష్కరించుకొని ఈ చిత్ర టీం ‘సింహాగిరి యాత్ర’ అని విజయ యాత్రని ఈ మంగళవారం నుంచి మొదలు పెట్టనున్నారు. ఈ యాత్ర గురించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమా అభిమానులను, మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు కలిసి నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version