యుఎస్ బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ కొల్లగొట్టిన లెజెండ్

legend
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా యుఎస్ లో కూడా కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది. యుఎస్ లో ‘లెజెండ్’ సినిమా మొదటి వీకెండ్ లో 2.15 కోట్ల($ 357,829) షేర్ కలెక్ట్ చేసింది. బాలకృష్ణ కెరీర్ లో మొదటి వీకెండ్ ఇన్తది కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి.

బాలకృష్ణ రెండు పవర్ఫుల్ పాత్రల్లో పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ యాక్షన్స్ లతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు. బాలకృష్ణ రేంజ్ కి సరిపోయే రేంజ్ లో జగపతి బాబు విలన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్లో రాధిక ఆప్టే సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు.

వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సినిమాకి సంబందించిన సింహా యాత్రని రేపటి నుంచి ప్రారంబించనున్నారు. ఈ యాత్రలో భాగంగా కొన్ని దేవాలయాలను, కొన్ని థియేటర్స్ ని విజిట్ చేసి ప్రేక్షకులని కలవనున్నారు.

Exit mobile version