బాలకృష్ణ ‘లెజండ్’ ఆడియో రిలీజ్ డేట్

బాలకృష్ణ ‘లెజండ్’ ఆడియో రిలీజ్ డేట్

Published on Feb 12, 2014 2:13 PM IST

Legend_First_Look1
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. ఈ సినిమా మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాయి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మార్చి 7న లేదా 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుక హైదరాబాద్ లోనే ఉంటుంది.

ఇటీవలే విడుదల చేసిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ కి మరియు నిన్న విడుదల చేసిన జగపతి బాబు ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ‘సింహా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు