నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లెజెండ్ సినిమా వచ్చే నెలలో శరవేగంగా సిద్ధమవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో ను మార్చ్ 9న విడుదలచేయనున్నారు. ఈ సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ బాలయ్య బాబుతో మొదటిసారిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఈ వేడుక హైదరాబాద్ లో కాకుండా వేరే ప్రాంతంలో వుండచ్చు
ఈ నేలాఖరి వరకూ సినిమా బృందమంతా విదేశాలలో షూటింగ్ జరుపుకోనున్నారు. బోయపాటి శ్రీను ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకేక్కిస్తున్నాడు. సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే హీరోయిన్స్. ఈ సినిమాలో జగపతిబాబు పూర్తిస్థాయి విలన్ పాత్రలో నటించనున్నాడు. వారాహి చలన చిత్రం మరియు 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి