మొదలయిన లారెన్స్ మూడవ ముని

మొదలయిన లారెన్స్ మూడవ ముని

Published on Dec 19, 2012 8:01 PM IST

MUNI3
లారెన్స్ రాబోతున్న చిత్రం “ముని – 3” రామానాయుడు స్టూడియోస్ లో ఈరోజు మొదలయ్యింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ ప్రై లి బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. లారెన్స్ సరసన తాప్సీ కనిపించనున్నారు. దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టగా సంతోష్ శ్రీనివాస్ కెమెరా ఆన్ చేశారు. నందిని రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి లారెన్స్ మాట్లాడుతూ ” హారర్ మరియు కామెడీ ని సమపాళ్ళలో కలిపి ఈ చిత్రం రానుంది ఈ చిత్రం కోసం ప్రధాన తారను ఎంపిక చేసుకోవాలి అనుకున్నాను తాప్సీ మనసులో మెదిలింది. “కాంచన” చిత్రంతో బెల్లంకొండ సురేష్ బాగా దగ్గరయ్యారు. ఈ చిత్ర రెగ్యులర్ చిత్రీకరణ జనవరి 15న మొదలు కానుంది”. విజయ్ అంథోని సంగీతం అందిస్తుండగా వి కృష్ణస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు