అందాల రాక్షసి సినిమాతో తెలుగు వారికి పరిచయమైన లావణ్య త్రిపాటి మొదటి సినిమాతోనే తన నటన మరియు అమాయకత్వంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకొని చేసిన రెండవ సినిమా ‘దూసుకెళ్తా’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ వరుసగా సినిమాలు చేసే పనిలో పడింది. అందులో భాగంగానే తమిళంలో ఓ సినిమాకి సైన్ చేసింది.
అదికూడా తమిళంలో బాగా క్రేజ్ ఉన్న శశికుమార్ సరసన చాన్స్ కొట్టేసింది. ‘బ్రమ్మన్’ అనే టైటిల్ పెట్టిన ఈ సినిమా ద్వారా కమల్ హాసన్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన సోక్రటీస్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఎక్కువగా సీరియస్, ఆర్ట్ సినిమాలు చేసిన శశికుమార్ మొదటిసారిగా చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ సినిమా కావడంతో ఈ సినిమాపై తమిళంలో అంచనాలున్నాయి. మంచి ఎంటర్టైనింగ్ సినిమాలో ఆఫర్ రావడంతో లావణ్య కూడా ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యే అవాక్షన్ ఉందని లావణ్య భావిస్తోంది.