విజయ్ ‘మాస్టర్’ పై లేటెస్ట్ అప్ డేట్ !

విజయ్ ‘మాస్టర్’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jun 21, 2020 8:55 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా ‘మాస్టర్’కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్‌ ఉంది. కాగా విజయ్ పుట్టినరోజు స్పెషల్‌ గా రేపు జూన్ 22 న మాస్టర్‌ సినిమా నుండి ఓ ఇంట్రస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేయాలని యూనిట్ యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. విజయ్ గత సినిమా ‘బిగిల్’ కంటే కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియా హడావుడి స్టార్ట్ చేసారు. మరి కరోనా తగ్గాగ ‘మాస్టర్’ ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.

ఇక విజయ్ గత సినిమా ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’గా వచ్చి ఇక్కడ మంచి కలెక్షన్స్ ను రాబట్టి, విజయ్ కు మాస్ ప్రేక్షకులలో మంచి అభిమానులను సంపాదించి పెట్టింది. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘మాస్టర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యాయట. ఇప్పటికే విజయ్ తన పార్ట్ కు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసారు. మరో వారం రోజుల్లో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కానున్నాయి. తెలుగులో విజయ్ పాత్రకు హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెబుతున్నారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు