“RRR” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

“RRR” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Oct 8, 2020 3:07 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ వండర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. చాలా కాలం తర్వాత మళ్ళీ షూట్ ఆరంభించుకున్న ఈ చిత్రం మరోసారి భారీ ఎత్తున అంచనాలను నెలకొల్పుకుంది. ముఖ్యంగా ఇపుడు తారక్ మీద షూట్ తో ప్రారంభం అయిన ఈ చిత్రం టీజర్ తో సిద్ధం కానుంది.

అయితే ఇపుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం షూట్ పై మరో అప్డేట్ వినిపిస్తుంది. ఈ చిత్రం అల్లూరి గా రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చరణ్ కు సరసన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇపుడు ఆమెకు సంబంధించి షూట్ రెడీ అవ్వనున్నట్టు తెలుస్తుంది.

వచ్చే నవంబర్ మొదటి వారం నుంచి ఈమెపై షాట్స్ తో తెరకెక్కనున్నట్టు ఇప్పుడు సమాచారం. చరణ్ మరియు ఆలియాల మధ్య సన్నివేశాలు అద్భుతంగా రాజమౌళి టేకప్ చేస్తున్నారని తెలిసిందే. ఇపుడు మాత్రం తారక్ మరియు చరణ్ అభిమానులు మాత్రం “రామరాజు ఫర్ భీం” టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు