‘ఆర్ఆర్ఆర్’ షూట్ పై లేటెస్ట్ అప్ డేట్ !

‘ఆర్ఆర్ఆర్’ షూట్ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Sep 5, 2020 11:03 PM IST


రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం లాక్ డౌన్ లో కూడా రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేశారు. అయితే అనూహ్యంగా రాజమౌళితో పాటు ఆయన కుటుంబం కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. రాజమౌళి కరోనా బారిన పడకముందు ఈ నెలలో షూట్ చేద్దామని ప్లాన్ చేశారు. ఇప్పుడు షూట్ నవంబర్ కి పోస్ట్ ఫోన్ చేశారట. ఇప్పుడు షూట్ పెట్టి టీమ్ ని కూడా రిస్క్ లో పెట్టినట్టు అవుతుందని భావించిన రాజమౌళి షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేశారు.

ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్.. మెయిన్ గా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా బాగుంటాయట. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి.

తాజా వార్తలు