దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి ప్రాజెక్ట్ ను లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కథ పై ఓ రూమర్ వినిపిస్తోంది. తిరుపతి నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పురాతన ఆలయం చుట్టూ ఈ కథ సాగుతుందని.. ఆ ఆలయానికి సంబంధించిన దొంగతనం ట్రాక్.. ఆ ట్రాక్ తో ముడి పడిన హీరో పాత్ర.. ఆ పాత్ర తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూ.. ఇలా ఈ కథ మొత్తం ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఉంటుందని తెలుస్తోంది.
మొత్తానికి ఈ సినిమాలో క్రైమ్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ డ్రామా కూడా చాలా బాగుంటుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో సీనియర్ కథానాయిక రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఆమె కూడా ఈ సినిమాతోనే తెలుగులోకి అరంగేట్రం చేయబోతుంది. చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు,


