ఓటీటీ, శాటిలైట్ డీల్ ముగించుకున్న ‘శంబాల’

ఓటీటీ, శాటిలైట్ డీల్ ముగించుకున్న ‘శంబాల’

Published on Nov 24, 2025 6:11 PM IST

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘శంబాల’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను యుగంధర్ ముని డైరెక్ట్ చేస్తుండగా ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. అయితే, రిలీజ్‌కు ముందే ఈ చిత్రం ఓటీటీ, శాటిలైట్ డీల్ ముగించుకుంది.

శంబాల చిత్ర ఓటీటీ రైట్స్‌ను ఆహా రూ.5 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అటు శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు రూ.2 కోట్లకు దక్కించుకున్నట్లు సినీ సర్కిల్స్ టాక్. ఆది సాయికుమార్ కెరీర్‌లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్స్‌ను వేగవంతం చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు