టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘లిటిల్ హార్ట్స్’

టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘లిటిల్ హార్ట్స్’

Published on Nov 24, 2025 9:58 PM IST

little-hearts

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సాయి మార్తాండ్ డైరెక్ట్ చేయగా ఆదిత్య హసన్ ప్రొడ్యూస్ చేశారు. ఇక మౌళి హీరోగా నటించిన ఈ సినిమాలో శివాని నగరం హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ ఛానల్‌లో డిసెంబర్ 7న సాయంత్రం 6.30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేయనున్నారు.

దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు బుల్లితెరపై వీక్షించి ఎంజాయ్ చేయవచ్చు. మరి ఈ సినిమాకు బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

తాజా వార్తలు