ఆ బ్యానర్‌లో అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ..?

ఆ బ్యానర్‌లో అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ..?

Published on Nov 25, 2025 1:00 AM IST

anilravupudi

టాలీవుడ్‌లో హిట్ మిషిన్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ఓ ప్రెస్టీజియస్ బ్యానర్ ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీకి చెందిన కెవిఎన్ ప్రొడక్షన్స్ అనిల్ రావిపూడితో త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యానర్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రాబోయే సినిమాను ప్రొడ్యూస్ చేయనుంది.

దీంతో అనిల్ రావిపూడితో ఈ నిర్మాణ సంస్థ ఎలాంటి సినిమాను పట్టుకొస్తుందా.. ఇందులో హీరో ఎవరు నటిస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు