పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ భారీ చిత్రమే “కల్కి 2898 ఎడి”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే రికార్డు గ్రాసింగ్ మొదటి భాగం చిత్రంగా నిలిచింది. అయితే ఈ చిత్రానికి పార్ట్ 2 కోసం కూడా చాలా మంది ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.
మరి ఫైనల్ గా ఈ చిత్రం ఎప్పుడు మొదలు అవుతుంది, ఈ మధ్యలో కొన్ని రూమర్స్ పై లేటెస్ట్ గా సాలిడ్ క్లారిటీ బయటకి వచ్చింది. ఈ సినిమా నిర్మాణం పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న స్వప్న దత్, ప్రియాంక దత్ లు నుంచి క్లారిటీ వచ్చేసింది. కల్కి 2 ఆల్రెడీ 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలిపారు.
అంతే కాకుండా వీటితో పాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి అని తెలిపారు. ఇక వీటితో పాటుగా దీపికా పదుకోణ్ పై వస్తున్న రూమర్స్ ని కూడా కొట్టి పారేసారు. ఆమె పార్ట్ 2 లో ఉన్నారని కన్ఫర్మ్ చేశారు. సో కల్కి 2 పై ఒక క్లారిటీ చాలా మందికి వచ్చినట్టే అని చెప్పాలి.