లేటెస్ట్.. ‘ఓజి’ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. ఆల్రెడీ వచ్చిన మొదటి పాట సాలిడ్ రెస్పాన్స్ ని అందుకోగా ఇక నెక్స్ట్ సాంగ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న ఓ అప్డేట్ ఉంటుంది అని అంతా ఆశించారు కానీ నేడు ఆ అప్డేట్ అందించారు.

అయితే ఇది కూడా చాలా మంది సాంగ్ కోసమే అనుకున్నారు కానీ ఇది సాంగ్ కోసం కాదు అన్నట్టు వినిపిస్తుంది. సినిమాలో హీరోయిన్ ఫస్ట్ లుక్ వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇపుడు వరకు ప్రియాంక మోహన్ లుక్ బయటకి రాలేదు. అదే ఇపుడు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా నుంచి వచ్చేది లుక్కా లేక ఫస్ట్ లుక్ అనేది కొంత సేపు ఆగితే తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version