‘సర్దార్ 2’ రిలీజ్ పై స్ట్రాంగ్ బజ్!

తమిళ్ నుంచి వచ్చిన హీరోస్ లో తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో వెర్సటైల్ హీరో కార్తీ కూడా ఒకరు. మరి కార్తీ హీరోగా చేస్తున్న చిత్రాల్లో రానున్న రోజుల్లో ఎక్కువ సీక్వెల్ సినిమాలే కనిపిస్తున్నాయి. మరి ఈ క్రేజీ సీక్వెల్స్ లో సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సర్దార్ 2” కూడా ఒకటి. దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై సాలిడ్ బజ్ ఉండగా ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా ఈ ఏడాదిలో అయితే రాదట. వచ్చే ఏడాది పొంగల్ రేస్ లో మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధం చేసుకుంటున్నారని టాక్. సో సర్దార్ 2 అయితే వచ్చే ఏడాది తెలుగులో కూడా సంక్రాంతి బరిలో ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నారు.

Exit mobile version