“వకీల్ సాబ్” ఆల్బమ్ పై లేటెస్ట్ బజ్.!

“వకీల్ సాబ్” ఆల్బమ్ పై లేటెస్ట్ బజ్.!

Published on Sep 10, 2020 1:21 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ఎలా విడుదల అవుతుంది అన్నదానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఇతరత్రా అంశాలకు సంబంధించి మాత్రం మంచి బజ్ వినిపిస్తుంది.

ఈ చిత్రంతో మొట్ట మొదటి సారిగా థమన్ పవన్ తో కలిసి పని చేస్తున్నారు. దీనితో థమన్ తన బెస్ట్ ను ఈ చిత్రం కోసం పెట్టేసినట్టుగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను మరియు లేటెస్ట్ మోషన్ పోస్టర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లను వింటేనే అర్ధం అవుతుంది. దీనితో ఈ సినిమా ఆల్బమ్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

అందుకు తగ్గట్టుగానే థమన్ ఈ చిత్రం కోసం నాలుగు నుంచి ఐదు పాటలను సమకూరుస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ అన్ని కూడా చాలా బాగా వచ్చాయట. ఇప్పటి వరకు పవన్ సినిమాలు ఎలా ఉన్నా అతని సినిమాల పాటలు మాత్రం మంచి హమ్మింగ్ గా ఉంటాయి. మరి ఈ ఆల్బమ్ ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

తాజా వార్తలు