‘దీపికా పదుకొణే’ ప్లేస్ లో ‘కాంతార’ బ్యూటీ ?

‘దీపికా పదుకొణే’ ప్లేస్ లో ‘కాంతార’ బ్యూటీ ?

Published on Oct 5, 2025 3:01 PM IST

deepika-padukone

హీరోయిన్ దీపికా పదుకొణే.. ‘కల్కి 2898 ఎ.డి.’ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె స్థానంలో ఎవ్వర్ని తీసుకుంటారో అని ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. ప్రస్తుతం సాయి పల్లవి పేరు బాగా వినిపిస్తోంది. కానీ, ఈ వార్తలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఐతే, ‘కల్కి’ సీక్వెల్ లో దీపికా స్థానాన్ని రుక్మిణీ వసంత్‌ తో భర్తీ చేయిస్తే బాగుంటుందని నాగ అశ్విన్ ఫీల్ అవుతున్నారట. ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమాలో తన సహజమైన నటనతో సినీప్రియుల మదిని దోచుకుంది రుక్మిణీ వసంత్‌.

కాబట్టి, దీపిక పదుకోన్ స్థానాన్ని రుక్మిణీ వసంత్‌ భర్తీ చేయగలదు. ఐతే, మరోవైపు మాత్రం ఈ సినిమాలో హీరోయిన్ కోసం అనుష్క, నయనతార, అలియా భట్ లాంటి పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరి చివరకు ఏ హీరోయిన్ ఫైనల్ అవుతుందో చూడాలి. ‘కల్కి సీక్వెల్’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని టాక్. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్‌ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడు పాత్ర పై ముగించారు కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందనే అనుకోవాలి.

తాజా వార్తలు