సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనేక సంఘటనలను తెరపైకి తెస్తుంది. తాజాగా దివంగత నటి జియా ఖాన్ తల్లి హీరో సల్మాన్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. జియా ఖాన్ తల్లి రబీనా అమిన్ తన కూతురు ఆత్మ హత్య కేసును సల్మాన్ ఖాన్ తన హోదా, పలుకుబడి ఉపయోగించి నీరుగార్చారు అన్నారు.తన కూతురు జియా ఖాన్ మరణానికి కారణమైన సూరజ్ పంచోలి ఈ కేసు నుండి బయటపడేలా సల్మాన్ వ్యవస్థలను మేనేజ్ చేశారు అని ఆమె ఆరోపించారు.
యంగ్ హీరో సుశాంత్ మరణానికి సంతాపం తెలిపిన ఆమె బాలీవుడ్ లో బెదిరింపులు, అణచివేత ఎక్కువైంది అన్నారు. పరిశ్రమలో పెద్దల బెదిరింపులకు యంగ్ హీరోలు బలైపోతున్నారు అన్నారు. ఇకనైనా బాలీవుడ్ మేల్కొనాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. లేక పోతే బాలీవుడ్ కారణంగా ఇలాంటి అనేక దురదృష్టకర సంఘటనలు జరుగుతాయని హెచ్చరించారు. 2013లో హీరోయిన్ జియా ఖాన్ ఉరి వేసుకొని మరణించింది.