కొత్త అవతారంలో పిచ్చెక్కిస్తున్న లక్ష్మీ రాయ్

కొత్త అవతారంలో పిచ్చెక్కిస్తున్న లక్ష్మీ రాయ్

Published on Apr 11, 2014 4:24 AM IST

Lakshmi-Rai
కొత్త అవతారంతో దర్శనమిస్తున్న లక్ష్మి రాయ్ ఫోటోలు ఈ మధ్య మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నాయి. దాదాపు రెండు నెలల వ్యవధిలో ఏకంగా 15కిలోల పైన తగ్గి ఈ బొద్దుగుమ్మ తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సరైన వ్యాయామం, బ్యాలన్సేడ్ డైట్ దీనికి కారణమని చెప్పుకొచ్చింది
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కార్బోహైడ్రేట్స్ ని వదిలి ప్రోటీన్లను ఆశ్రయించిందని తెలిపింది. అంతేకాక రోజుకి ఒక గంట తప్పకుండా వ్యాయామం కూడా చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ ఒక తమిళ సినిమాలో బైకర్ పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో తన పాత్రకోసం దర్శకుడు బరువు తగ్గమని చెప్తే, బరువు తగ్గి వెళ్ళాకా ఆ దర్శకుడే తనని గుర్తుపట్టలేదట
ఈ భామ తెలుగులో బలుపు సినిమాలో ఒక ప్రత్యేక పాటలో మెరిసింది. ఈ ముద్దుగుమ్మని ఈ ఏడాది రెండు తమిళ సినిమాలలో చూడచ్చు

తాజా వార్తలు