ఉప్పు నీళ్ళల్లో చిత్రీకరణలో పాల్గొన్న లక్ష్మి మంచు

లక్ష్మి మంచు రాబోతున్న చిత్రం ” గుండెల్లో గోదారి ” చిత్రం కోసం చాలా కష్టపడుతున్నారు ప్రస్తుతం ఈ చిత్రం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ముల్కిపురం లో చిత్రీకరణ జరుపుకుంటుంది. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంచు లక్ష్మి నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ప్రొడక్షన్ బాధ్యతలు మరియు నటన రెండింటిని మంచు లక్ష్మి చేస్తున్నారు. ఈ మధ్యనే చెత్తతో నిండిన చల్లటి ఉప్ప నీళ్ళలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ అయిన ఈ చిత్రం 1986 లో జరిగిన ప్రేమ కథ గా ఉండబోతుంది. ఆది,లక్ష్మి మంచు,సందీప్ కిషన్ మరియు తాప్సీ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version