హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్

హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్

Published on Nov 25, 2013 7:35 PM IST

Ladies-and-Gentleman

మల్టీ స్టారర్ సినిమాలు తెలుగులో ఒకటి తరువాత ఒకటి వస్తూ విజయాన్ని సైతం అందుకుంటున్నాయి. ఇప్పుడు ఇద్ధరు అంతకంటే ఎక్కువ ప్రాధాన పాత్రలలో సినిమాలు రూపుదిద్ధుకుంటున్నాయి. ప్రస్తుతం మధుర శ్రీధర్ తీస్తున్న ‘లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్’ సినిమాలో నలుగురు హీరోలు ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మహత్ రాఘవేంద్ర, అడవి శేష్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు హీరోలు. స్వాతి దీక్షిత్, జాస్మిన్ మరియు తేజస్వి హీరోయిన్స్

ఈ సినిమా ఈనెల హైదరాబాద్ లో మొదలై ఈరోజే కొత్త షెడ్యూల్ ను ప్రారంభించుకుంది. అడవి శేష్ షూటింగ్ లో పాల్గొనగా కమల్ ఇంకా జతకలవాల్సి వుంది. మిగిలిన ఇద్దరు తారలు గత కొన్ని వారాలుగా షూటింగ్ లో బిజీగా వున్నారు. సైబర్ క్రైమ్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పి.బి మంజునాథ దర్శకుడు. ఏం.వి.కె రెడ్డి సహా మధుర శ్రీధర్ శిరిడీ సాయి కంబైన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీత దర్శకుడు

తాజా వార్తలు